Friday, November 22, 2024

అక్కడ పరిస్థితి అమానవీయం : జెలెన్‌స్కీ..

మేరియుపోల్‌లో చిక్కుకున్న వేలాదింది పౌరులను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా బ్రిటన్‌, స్వీడన్‌ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. ముఖ్యంగా రష్యా సేనల దిగ్బంధనంలో ఉన్న మేరియుపొల్‌ను విముక్తి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ‘రష్యా సేనలను ఎదుర్కొవడం లేదా దౌత్యంపైనే మేరియుపోల్‌ ‘విధి’ ఆధారపడి ఉంది. ఉక్రెయిన్‌కు అవసరమైన భారీ ఆయుధాలు, విమానాలను భాగస్వామ్య పక్షాలు ఆలస్యం చేయకుండా తక్షణమే అందిస్తే.. ఈ నగరంపై ఆక్రమణదారుల ఒత్తిడిని తగ్గించగలుగుతాం.

తద్వారా దిగ్బంధనాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. లేదంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్న ఆయన.. ఇందులో భాగస్వామ్య పక్షాల పాత్ర నిర్ణయాత్మకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆకలితో అలమటిస్తున్న పౌరులతో ప్రస్తుతం మేరియుపొల్‌లో పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయని.. అక్కడున్న ప్రతి వ్యక్తిని నాశనం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement