Wednesday, November 20, 2024

బుల్‌ బేజారు! మూడో రోజూ నష్టాలే.. 237 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు బుధవారం కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్టానికి చేరుకోవడంతో మదుపరులు ప్రాఫిట్‌ బుకింగ్‌వైపు పరుగులు తీశారు. అదేవిధంగా బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం కూడా దేశీయ సూచీలు క్షీణించేందుకు కారణం. బుధవారంతో ఈ వారం మార్కెట్‌ ముగిసిపోవడంతో.. ఆరంభంలో కొనుగోళ్ల జోరు కనిపించినా.. అది చివరి వరకు కొనసాగలేదు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇన్వెస్టర్లను రిస్క్‌ నుంచి వెనుకడుగు వేసేలా చేసింది. ఉదయం 58,881 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే నష్టాల్లోకి వెళ్లిపోయింది. రోజంతా అమ్మకాల ఒత్తిడితో నష్టాలు మూటగట్టుకుంది. చివరికి 237.44 పాయింట్లు నష్టపోయి.. 58,338.93 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 69.60 పాయింట్ల (0.40 శాతం) లాభంతో 17,599.90 పాయింట్ల వద్ద ఓపెన్‌ అయ్యింది. చివరికి 54.65 పాయింట్ల నష్టంతో 17,475.65 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కూడా 334.37 పాయింట్లు (0.57 శాతం)తో 58,910.74 పాయింట్ల వద్ద పాజిటివ్‌ ఓపెనింగ్‌ అయ్యాక.. 58,338.93 పాయింట్ల వద్ద ముగిసింది. 1547 కంపెనీ షేర్లు క్షీణించగా.. 1852 కంపెనీల షేర్లు లాభపడ్డాయి.

స్మాల్‌ క్యాప్‌లో 0.19శాతం క్షీణత..

నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 100 ఇండెక్స్‌ 0.03 శాతం క్షీణించగా.. స్మాల్‌ క్యాప్‌ 0.19 శాతం లాభపడింది. నిఫ్టీ బ్యాంక్‌ 0.87, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 0.87 శాతం పడిపోయింది. నిఫ్టీ ఆటో 0.84 శాతం వరకు పడిపోయింది. గురువారం అంబేద్కర్‌ జయంతి, శుక్రవారం గుడ్‌ ఫ్రైడే కావడం ఎప్పటిలాగే.. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో.. వరుసగా నాలుగు రోజుల పాటు మార్కెట్‌ మూసి ఉండనుంది. తిరిగి ఏప్రిల్‌ 18న ప్రారంభం అవుతాయి. ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతుందనే ప్రకటన కూడా దేశీయ సూచీలను క్షీణించేలా చేశాయి. ఫలితంగా ముడి చమురు ధరలు మళ్లిd ఎగిశాయి. అమెరికాలో 16 నెలల తరువాత.. మంత్లి కన్స్యూమర్‌ ధరలు పెరిగాయి. దీంతో నిఫీ ఎంతో కీలకమైన 17,500 మార్క్‌ను కోల్పోయింది. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకీ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్‌, ఐటీసీ లిమిటెడ్‌, సన్‌ ఫార్మా, యూపీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. రియల్టి, ఆటో, బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోగా.. మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement