స్టార్స్ తో కలిసి నటిస్తే ఆత్మ విశ్వాసం పెరుగుతుందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. వృత్తిపట్ల ప్రేమ కోల్పోతేనే ఒత్తిడి, అసహనం పుట్టుకొస్తాయని తెలిపింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సైనిక నేపథ్య కుటుంబం నుంచి రావడం వల్ల సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో చిన్నతనంలోనే నేర్చుకున్నా అని చెప్పింది.వృత్తి పట్ల ఫ్యాషన్ కలిగి ఉంటే చేసే పనిలో ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పింది. దక్షిణాదితో పాటు హిందీలో తాను ఎందరో అగ్ర హీరోలతో కలిసి పనిచేశానని, అయినా ఎప్పుడూ ఒత్తిడికి గురికాలేదని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఓ మహిళా సదస్సులో పాల్గొన్న ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. అగ్ర నటీనటులతో కలిసి పనిచేస్తున్నప్పుడు వారి దగ్గరి నుంచి చాలా విషయాల్ని నేర్చుకోవాలనే తపన ఉండేదని, అందుకే ఏనాడు టెన్షన్ పడలేదని చెప్పింది.ఆమె మాట్లాడుతూ ‘అక్షయ్‌కుమార్, సూర్య, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలతో కలిసి పనిచేశాను. అందుకే కెరీర్‌పరంగా వచ్చిన అడ్డంకుల్ని చూసి ఎప్పుడూ అధైర్యపడలేదు. ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటమే నా విజయ రహస్యం.
Advertisement
తాజా వార్తలు
Advertisement