Wednesday, November 20, 2024

దంచికొడుతున్న ఎండలు, 122 ఏళ్ల గరిష్టానికి ఉష్ణోగ్రత.. మేలో భానుడి ఉగ్రరూపం

దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు భారతీయ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. 122 ఏళ్ల తరువాత.. తొలిసారి ఏప్రిల్‌లో భారీ ఉష్ణోగ్రతలు రికార్డయినట్టు వివరించారు. మున్ముందుకు దేశ వ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రతరం అవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. నార్త్‌వెస్ట్‌తో పాటు మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో 122 ఏళ్ల తరువాత ఈ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అధికారులు వివరించారు. ఏప్రిల్‌ 28వ తేదీ వరకు నమోదైన ఉష్ణోగ్రత డేటా ఆధారంగా కీలక విషయాలు వెల్లడించారు. 1901 ఏప్రిల్‌లో ఈ స్థాయిలో ఎండలు దంచికొట్టాయని, ఆ తరువాత.. ఇప్పుడు 2022 ఏప్రిల్‌లో నమోదవుతున్నాయని వివరించింది. నార్త్‌వెస్ట్‌ ప్రాంతంలో ఏప్రిల్‌లో సగటున 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1901, ఏప్రిల్‌తో పోలిస్తే.. 3.35 డిగ్రీలు అధికం. 2010 ఏప్రిల్‌లో 35.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మధ్య భారతదేశంలో చూసుకుంటే.. సగటున 2022 ఏప్రిల్‌లో 37.78 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతంలో 1973, ఏప్రిల్‌లో సగటున నమోదైన 37.75 డిగ్రీల కంటే అధికం. కనిష్ట ఉష్ణోగ్రత కూడా ఏప్రిల్‌లో సాధారణం కంటే ఎక్కువగా ఉంది. ఇది రాత్రి సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంది.

పెరిగిన సాధారణ ఉష్ణోగ్రత..

దేశంలోని నార్త్‌వెస్ట్‌ ప్రాంతంలో సగటున రాత్రి ఉష్ణోగ్రత 19.44 డిగ్రీలు ఉంటే.. 1901 తరువాత.. మరో 1.75 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదల నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత కూడా ఏప్రిల్‌లో సాధారణం కంటే ఎక్కువగా ఉంది. ఇది రాత్రి సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంది. నార్త్‌వెస్ట్‌తో పాటు మధ్య భారతదేశంలోనిపలు ప్రాంతాల్‌లో ఏప్రిల్‌, మేలో నిరంతరంగా తక్కువ వర్షపాతం నమోదైంది. మార్చిలో వాయువ్య భారతదేశంలో దాదాపు 89 శాతం వర్షపాతం లోటు నమోదు కాగా.. ఏప్రిల్‌లో 83 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వాయువ్య, మధ్య భారతదేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొనేందుకు ప్రధాన కారణం.. రుతుపవనాలకు ముందు వర్షపాతమే అని ఐఎండీ అధికారులు వివరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్‌ 27 నుంచి వడగాలులు వీస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో సగటున 35.05 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

సాధారణ పరిస్థితుల కంటే.. 1.12 డిగ్రీలు అధికం. 122 ఏళ్ల తరువాత.. నాల్గో అత్యధిక సగటు ఉష్ణోగ్రతగా అధికారులు వివరించారు. 2010లో అత్యధికంగా 35.42 డిగ్రీలు నమోదైంది. మేలో వేడి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. ఢిల్లి, పంజాబ్‌, హర్యానా, చండీగడ్‌, రాజస్థాన్‌, జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌లో మేలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సాధారణం కంటే అత్యధికంగా రికార్డు అవుతాయని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement