Saturday, November 23, 2024

మూడు నెల‌ల ముందే మొదలైన సంక్రాంతి హడావుడి.. ట్రైన్ టికెట్లకు ఫుల్ డిమాండ్!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. పండుగకు మూడు, నాలుగు నెలల ముందు నుంచే రిజర్వేషన్లు చేసుకుంటారు. ఇప్పటికే సంక్రాంతి రైళ్లు నిండిపోయాయి. ప్రస్తుతానికి ఉన్న రైళ్లలో టికెట్లు ఫుల్ అయ్యి వెయిటింగ్ లిస్ట్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఏపీకి నడిచే రైళ్లలో టికెట్లు బుకింగ్ పూర్తై రిగ్రెట్ చూపిస్తున్నాయి.

హైదరాబాద్ లో ఉండే ఏపీవాసులు సంక్రాంతి సమయంలో వారి స్వస్థలాలకు వెళ్తారు. దీంతో పండుగ సమయంలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఈసారి కూడా ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉంది. అలాగే బెంగళూరు, చెన్నై, పుణే, ముంబయి వంటి నగరాల్లో ఉన్న ఏపీవాసులు కూడా సంక్రాంతి పండుగకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నగరాల నుంచి ఏపీ మీదుగా వెళ్లే రైళ్ల టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే సంక్రాంతి టైం టికెట్లు ఫుల్ అయ్యాయి.

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నర్సాపురంతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్ల అన్నీ బుక్ అయిపోయాయి. పండుగ సమయంలో రైల్వే శాఖ నడిపే ప్రత్యేక రైళ్లు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీల ప్రత్యేక బస్సులు, ప్రైవేటు వాహనాలే ప్రయాణికులకు దిక్కు కానున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం రైళ్లలో నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement