Monday, November 18, 2024

ODI World Cup | బంగ్లాను ఉతికి ఆరేసిన స‌ఫారీలు.. 233 ప‌రుగుల‌కే బంగ్లా ఆలౌట్‌

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా ఇవ్వాల (మంగ‌ళ‌వారం) వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా జ‌ట్టు విజృంభించింది. బంగ్లాదేశ్ పై 149 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మొద‌ట టాస్ గెలిచి, బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ.. మరోసారి 300+ (382) పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది.. అదే రీతిలో బౌలింగ్ లోనూ చెల‌రేగింది. 383 ప‌రుగుల భారీ టర్గెట్ తో ఛేజింగ్ కు దిగిన‌ బంగ్లాదేశ్ జ‌ట్టును 47 ఓవ‌ర్ల‌లో 233 ప‌రుగుల‌కు ప‌రిమితం చేసి ఆలౌట్ చేసింది.

బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో మహముదుల్లా రియాద్ (111) శ‌త‌కంతో మెర‌వ‌గా.. లిట్టన్ దాస్ (22) ప‌రుగులు చేశాడు. ఇక మిగితా ఎవ్వ‌రూ అంత‌గా రాణించ‌లేక‌పోయారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో గెరాల్డ్ కోయెట్జీ 3 వికెట్లు తీయ‌గా.. లిజాడ్ విలియమ్స్ 2, మార్కో జాన్సెన్ 2, రబడ 2 వికెట్లు ద‌క్కించుకున్నారు. ఇక‌, కేశవ్ మహారాజ్ ఒక్క‌ వికెట్ తీసాడు.

అంత‌క‌ముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జ‌ట్టులో.. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్, హెన్రిచ్‌ క్లాసెన్ వాంఖడే మైదానాన్ని బౌండరీలతో హోరెత్తించారు. క్వింటన్‌ డికాక్ (174) మరోసారి భారీ శతకంతో చెలరేగాడు, హెన్రిచ్‌ క్లాసెన్ (90) ప‌రుగుల‌తో క్లాస్‌ ఇన్నింగ్ ఆడాడు. ఎయిడెన్ మార్క్రమ్ (60) అర్ధ సెంచరీతో మెరిశాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (34) విధ్వంసం సృష్టించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన స‌ఫారీలు 382 పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement