Monday, November 25, 2024

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలు నా సహాయం కోరాయి : కేఏ పాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం తన సహాయం కోరిందని ప్రజాశాంతి పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్ (కేఏ పాల్) అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన పాల్, తాను ఈ ఎన్నికల్లో అభ్యర్థిని కాదని తెలిపారు. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన ఓ న్యూట్రల్ అభ్యర్థి పేరును బీజేపీ నాయకత్వానికి ప్రతిపాదించానని చెప్పారు. మరోవైపు ‘సేవ్ సెక్యులర్ ఇండియా’ తరఫున ప్రతిపక్షం కూడా తన సహాయం కోరిందని వెల్లడించారు. శరద్ పవార్, గులాం నబీ ఆజాద్ వంటి నేతల పేర్లను విపక్షాలు ప్రతిపాదించాయని, అయితే ఇద్దరూ విముఖత వ్యక్తం చేశారని తెలిపారు. విపక్షాల్లో ఐక్యత లేదని, ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని పాల్ వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థే గెలుపొందుతారని ఆయన స్పష్టం చేశారు. క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ప్రచారం చేయాల్సిందిగా బీజేపీ అగ్రనాయకత్వం తనను కోరుతున్నారని తెలిపారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు విఫలమవుతూ వచ్చారని కేఏ పాల్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఈ సమావేశంలో తనతో పాటు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారిని మీడియా సమావేశంలో కూర్చోబెట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement