Friday, November 22, 2024

కరోనా ఎఫెక్ట్… దేవుడి దర్శనం ఉందా ? లేదా ?

కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆలయాల్లో దర్శనాలకు భక్తులను అనుమతించాలా? వద్దా? మరిన్ని ఆంక్షలు విధించాలో? సూచించాలని రాష్ట్ర దేవాదాయశాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పలు ప్రతిపాదనలను కమిషనర్‌ కార్యాలయం నుంచి పంపించారు. అనేక ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగుల్లో కొందరు కొవిడ్‌ బారినపడ్డారు. కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో ఉండే అన్ని ఆలయాల్లో మే 15 వరకు భక్తులకు దర్శనాలు నిలిపేశారు. దీంతో రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో ఆంక్షలు అమలుపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దర్శనాలు పూర్తిగా నిలిపేయాలా? గంటకు కొంత మంది చొప్పున పరిమితంగా అనుమతించాలా? స్పష్టత ఇవ్వాలని అడిగింది. అలాగే ఉత్సవాలు, కల్యాణాలను భక్తులు లేకుండా ఏకాంతంగా నిర్వహించడంపై కూడా ప్రతిపాదించారు.

ప్రస్తుతం మాస్క్‌ ఉంటేనే భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల మధ్య, క్యూ లైన్ల మధ్య దూరం ఉండేలా చూడటం, చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వారిని అనుమతించకపోవడం వంటివి మరింత కఠినంగా అమలు చేయడంపై కూడా ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement