రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ సెగలు జీ20 సదస్సును తాకుతున్నాయి. వచ్చేవారం జరగనున్న సమావేశంలో గ్రూప్ ఫొటో దిగొద్దని ప్రపంచ నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సదస్సు ప్రారంభానికి ముందు ఆయా దేశాల అధినేతలు దగ్గరగా చేరి ఫొటోకు ఫోజివ్వడం రివాజు. ఈసారి ఈ క్రమం తప్పనుందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ సదస్సుకు పుతిన్ కు బదులుగా ఆ దేశ విదేశాంగ మంత్రి హాజరవుతున్నారు. వర్చువల్ ప్రసంగానికి జెలెన్‌స్కీ తిరస్కరించారని సమాచారం. పుతిన్ పాల్గొనే సదస్సులో తాను హాజరుకాలేనని ఇప్పటికే స్పష్టంచేశారు. మరొకవైపు బ్రిటన్ కూడా రష్యాకు వ్యతిరేకంగా గళం విప్పింది. సదస్సుకు రష్యా వస్తే, అనేక అంశాల్లో ఏకాభిప్రాయం సాధ్యంకాక పోవచ్చని అభిప్రాయపడింది.
- Advertisement -