Friday, November 22, 2024

Big story | ఇక అరటి పండ్ల వంతు.. భ‌య‌పెడుతున్న ధరలు

దేశంలో సామాన్యులను ఇప్పటి వరకు టమాటా ధరలు భయపెట్టాయి. ఇక నుంచి అరటి పండ్ల ధరలు కూడా ఇదే బాటులో ఉన్నాయి. ప్రస్తుతం టమాటా సరఫరాలు పెరగడం, నేపాల్‌ నుంచి దిగుమతులు వంటి కారణాలతో వాటా ధరలు చాలా వరకు దిగి వచ్చాయి. ప్రస్తుతం బెంగళూర్‌లో అరటి పండ్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఇటు హైదరాబాద్‌లోనూ సాధారణంగా బండ్లపై అమ్మకాల్లో డజన్‌ 60 నుంచి వంద రూపాయల వరకు అమ్ముతున్నారు.

రైతుల నుంచి తగినంత సరకు మార్కెట్‌కు రాకపోవడం వల్లే అరటి పండ్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. బెంగళూర్‌లో విక్రయించే అరటి పండ్లు ప్రధానంగా తమిళనాడు నుంచి వస్తాయి. బెంగళూర్‌ మార్కెట్‌లో ఎలక్కిబలే, పచ్‌బలే రకాలకు మంచి డిమాండ్‌ ఉంది. తమిళనాడు నుంచి ఈ రకాల పండ్ల సరఫరా తగ్గిపోయింది.

నెల రోజుల క్రితం బిన్నీపేట్‌ మార్కెట్‌కు రోజుకు 15,00 క్వింటాళ్ల ఎలక్కిబలే అరటి వస్తే, ప్రస్తుతం వెయ్యి కింట్వాళ్లు మాత్రమే వస్తోందని మార్కెట్‌ అధికారులు తెలిపారు. తమిళనాడులోని హోసూరు, కృష్ణగిరి నుంచి ఎక్కువగా అరటి కర్నాటకకు రవాణా అవుతోంది.

సరఫరా తగినంతగా లేకపోవడంతో హోల్‌సేల్‌లోనే ఎలిక్కిబలే రకం కేజీ 78 రూపాయలు, పచ్‌బలే రకం 18-20 రూపాయలు పలుకుతోంది. అన్ని ఖర్చులు కలుపుకుని వ్యాపారులు వీటిని కేజీకి 100, 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. చవతి, విజయ దశమి వంటి పండుగులు వస్తున్నందున వీటి ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement