Friday, November 22, 2024

హైదరాబాద్​ సిటీనీ వీడని వర్షం.. ఉదయం, సాయంత్రం వేళల్లో దంచికొడుతున్న వాన!

హైదరాబాద్ సిటీని వర్షం వీడడం లేదు. ఇవ్వాల (శుక్రవారం) నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్త‌రు నుంచి భారీవర్షం కురిసింది. ఈ వర్షానికి ప్రధాన రోడ్లను వరద నీరు ముంచెత్తింది. కొన్ని ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు రోడ్లపైకి చేరడంతో పాదచారులు, వాహనదారుల ఇబ్బందులు పడ్డారు. సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈనెల 7న బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నగర ప్రజలను అప్రమత్తం చేసింది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement