Monday, November 25, 2024

AP | ప్రిన్సిపాల్ కు కోప‌మొచ్చింది.. వాళ్ల జ‌ట్టును క‌త్తిరించింది..

జి.మాడుగుల, ఏఎస్ఆర్ జిల్లా నవంబర్ 18 (ఆంధ్రప్రభ ) : అల్లూరు జిల్లా జి.మాడుగుల మండలం కేజీబీవీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారి 23మంది విద్యార్థినుల‌ జుట్టు కత్తిరించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక పౌర్ణమి అయిన శుక్రవారం పాఠశాల విద్యార్థుల తమ కాలకృత్యాలు తీర్చుకొని భక్తిశ్రద్ధలతో పాఠశాలకు హాజరు కావాలనే ఉద్దేశంతో ముస్తాబవుతున్నారు.

ఆ సమయంలో పాఠశాలకు నిత్యం నిర్వహించే అసెంబ్లీకి ఇంటర్మీడియట్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆలస్యంగా రావడంతో ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి ఆగ్రహం వ్యక్తం చేసి విద్యార్థుల పాఠశాల ప్రాంగణంలో ఎండలో సుమారు రెండు గంటల పాటు నిలబెట్టారు. అప్పటికీ తన ఆవేశం చల్లారకపోవడంతో అసెంబ్లీకి రాని విద్యార్థుల్లో కొంతమందిపై చేయి చేసుకున్నారు. ఉపాధ్యాయురాలు అనే విషయాన్ని మరిచి విద్యార్థులపై పైశాచికంగా దాడి చేసి ఆనందాన్ని పొందారు.

విద్యార్థులు జుట్టును తను ఇష్టానుసారంగా కత్తిరించి విద్యార్థుల మనోవేదనకు కారకురాలయ్యారు. జుట్టు కత్తిరించిన సమయంలో కొంతమంది విద్యార్థులు పాఠశాల చుట్టూ పరిగెడుతున్న వారిని వెంబడించి తమ వద్ద ఉన్న కత్తెరతో జుట్టును విచక్షణా రహితంగా కత్తిరించి పైశాచిక ఆనందాన్ని పొందారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఒకరు తనకు మొక్కు ఉందని తనకు జుట్టు కత్తిరించవద్దని ఎంత ప్రాధేయ ప‌డ్డా వినిపించుకోకుండా తన కార్యక్రమాన్ని కొనసాగించారు.

- Advertisement -

జుట్టు కత్తిరించిన తర్వాత విద్యార్థులను మనోవేదన తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయినప్పటికీ కనీసం మంచినీళ్లు కూడా సదరు విద్యార్థులకు అందించడానికి ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారి నిరాకరించారని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement