హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలతో ముంచెత్తారు. ఇందుకు సంబంధించిన లేఖను ప్రధాని మోడీ ట్విట్టర్లో పోస్టు చేశారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌కు అందించిన సేవలు అమోఘం, యువక్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. మిథాలీకి ప్రధాని రాసిన లేఖలో ఏముందంటే… ”రెండు దశాబ్దాలకు పైగా మీరు భారత క్రికెట్‌కు సేవలందించారు.
మీ ప్రతిభా పాఠవాలతో జాతీయ జట్టును నడిపించిన తీరు అమోఘం. మీ ప్రదర్శన అద్భుతం. ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. మీ కెరీర్ మొత్తం అంకెలతో ఉన్నత శిఖరాలకు చేరింది. మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరెన్నో రికార్డులు నెలకొల్పారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక టాప్ స్కోరర్‌గా నిలిచారు. మీ అథ్లెట్‌గా ట్రెండ్ సెట్టర్ అయ్యారు” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ లేఖపై మిథాలీ రాజ్ స్పందిస్తూ… ప్రధాని మోడీకి ఎల్లవేళలా కృతజ్ఞురాలిగా ఉంటానని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.