Tuesday, November 26, 2024

పాక్‌లో భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

బహిరంగ మార్కెట్‌లో యుఎస్‌ డాలర్‌తో పోల్చితే పాకిస్థాన్‌ రుపీ కనిష్టస్థాయికి క్షీణించిన నేపథ్యంలో పెట్రోల్‌,డీజిల్‌ ధరలను భారీగా పెరగాయి. ప్రస్తుత ఆధ్యాన్న పరిస్థితుల్లో లీటరుకు రూ.35కి పెంచుతున్నట్టు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు కిరోసిన్‌ ధరను రూ.18లకు పెంచినట్టు పాక్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌దార్‌ పేర్కొన్నారు. ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన 10 నిమిషాల్లోనే అవి అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరల ప్రకారం హై-స్పీడ్‌ డీజిల్‌ లీటరుకు రూ.262.80, పెట్రోలు రూ.249.80, కిరోసిన్‌ ఆయిల్‌ 189.83కు చేరుకున్నాయి. అంతర్జాతీయ ధరలతో పాటు రూపాయి విలువ తగ్గుదల ఉన్నప్పటికీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆదేశాల మేరకు ఈ ఉత్పత్తుల కనీస ధరలను పెంచామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

దేశంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా కూడా గత నాలుగు నెలలుగా పెట్రో ఉత్పత్తులను పెంచలేదన్నారు. చమురు, గ్యాస్‌ నియంత్రణ అథారిటీ సిఫార్సు మేరకే ధరలు పెంచామని ఆయన అన్నారు. పాకిస్థానీ రూపాయి విలువ ఇటీవల యుఎస్‌ డాలర్‌తో పోల్చితే రూ. 34లకు పడిపోయింది. నిలిచిపోయిన అంతర్జాతీయ ద్రవ్యనిధి రుణ సౌకర్యాన్ని పునరుద్ధరించడానికి డాలర్‌ మారకపు రేటుపై ప్రభుత్వం అనధికార పరిమితిని తొలగించిన తర్వాత పాకిస్థానీ రూపాయి కూడా దారుణంగా క్షీణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement