బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధర పడిపోయింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం. జూలై 8న బంగారం ధర నేలచూపులు చూపసింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 820 మేర తగ్గింది. దీంతో ఈ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 51,110కు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు కూడా రూ. 750 తగ్గింది. దీంతో ఈ పసిడి రేటు పది గ్రాములకు రూ. 46,850కు పడిపోయింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ రేటు రూ.100 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 62,400కు క్షీణించింది. వెండి రేటు నిన్న భారీగా దిగివచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement