టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 15 సిరీస్ లో నాలుగు మోడళ్లను లాంచ్ చేసింది. కాగా, ప్రస్తుతం ఈ ఫోన్లలో అందించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, గతంలో మార్కెట్లోకి వచ్చిన పాత ఐఫోన్ల ధరలు గ్లోబల్ మార్కెట్లలో భారీగా తగ్గుతున్నాయి. మరో వారంలో ఐఫోన్ 15 సేల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రస్తుతం దేశంలో కూడా పాత ఐఫోన్ల ధరలు తగ్గాయి. తాజాగా అందుబాటులోకి రానున్న పాత ఐఫోన్ మోడల్స్ ధరలను యాపిల్ సవరించింది. వీటిలో iPhone 14, iPhone 14 Plus, iPhone 13, iPhone SE వేరియంట్లు ఉన్నాయి.
ఈ ఐఫోన్ల కొత్త ధరలను దేశంలోని యాపిల్ స్టోర్లలో కంపెనీ అనౌన్స్ చేసింది. దేశంలోని యాపిల్ ఫిజికల్ స్టోర్లలో కూడా కొత్త, తగ్గింపు ధరలతో ఈ ఐఫోన్లు అందుబాటులో ఉంటాయి. వీటి అసలు ధరలు, ఐఫోన్ 15 లాంచ్ తర్వాత మారిన ధరలను పరిశీలిద్దాం..
ఐఫోన్ SE ధరలు (2023)
ఐఫోన్ SE 64GB ధర ఇప్పుడు రూ. 49,900కి తగ్గింది. ఇదే డివైజ్ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 54,900కి పరిమితమైంది. అలాగే ఐఫోన్ SE 256GB ఎడిషన్‌ను రూ. 64,900కి సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ SE మోడల్ 64GB వేరియంట్‌ను ఇంకా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. అయితే ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే ఇది చాలా పాతదిగా అనిపిస్తుంది. దీని ధర రూ. 50,000 నుంచి ప్రారంభమవుతుంది.
ఐఫోన్ 13 ధరలు (2023)
ఐఫోన్ 13 కొత్త ధరల వివరాలను యాపిల్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఐఫోన్ 13 128GB మోడల్ ధర రూ. 59,900కి తగ్గింది. ఇదే ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 69,900కి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐఫోన్ 13 512GB ఎడిషన్‌ను రూ.89,900కి సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 13 ఒక్కటే మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే దేశంలోని ఆఫ్‌లైన్ స్టోర్ల నుంచి ప్రో మోడళ్లను కొనుగోలు చేయవచ్చు.
యాపిల్ ఐఫోన్ 14 ధరలు (2023)
భారతదేశంలో యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఇప్పుడు రూ. 10,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో ఐఫోన్ 14 128GB ఎడిషన్ రూ. 69,900కి లభిస్తుంది. ఐఫోన్ 14 256GB మోడల్ ధర రూ. 79,900గా ఉంది. ఐఫోన్ 14 512GB మోడల్ ధరను కంపెనీ రూ. 99,900గా నిర్దేశించింది. ఐఫోన్ 14 ప్లస్ 128GB డివైజ్‌ను రూ. 79,900కి సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 14 ప్లస్ 256GB మోడల్ రూ. 89,900కి అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 14 ప్లస్ 512GB ఎడిషన్ ధర రూ.1,09,900కి తగ్గింది.