Saturday, November 23, 2024

దిగొస్తున్న టమాట ధర.. వారం క్రితం దాకా 54కు కిలో ఇప్పుడు 26కే కిలో

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రెండు నెలలుగా కొండెక్కిన టమాట ధర దిగివస్తోంది. హైదరాబాద్‌ నగరంలో టమాట ధర తగ్గింది. వారం క్రితం వరకు కిలో టమాట ధర రూ.54 పలకగా… రెండు, మూడు రోజలుగా ధర సగానికి పడిపోయింది. ప్రస్తుతం కిలో టమాటను రూ.26కే వ్యాపారులు విక్రయిస్తున్నారు. స్థానిక వ్యాపారులు టమాటను ఢిల్లి మార్కెట్‌కు ఎక్కువగా తరలించడంతో కొరత ఏర్పడి ధరల పెరుగుదలకు దారితీసిందని చిల్లర వ్యాపారులు చెబుతున్నారు.

ఈ వానాకాలం సీజన్‌లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వివిధ రకాల కూరగాయలు అందుబాటులోకి వచ్చాయి. వారంక్రితం నగరంలోని రైతు బజార్లలో రూ.50కి కిలో ఉన్న పచ్చిమిర్చి ధర ఇప్పుడు రూ.45కు పడిపోయింది. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, దొండకాయి, క్యాలీఫ్లవర్‌ రేటు కూడా వారం క్రితంతో పోల్చితే రూ.5దాకా తగ్గినట్లు వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement