న్యూఢిల్లి: గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ ధరలు పెంచుతూ వస్తున్నది. దీంతో ఒకటో తారీఖు వచ్చిందంటే వేటి ధరలు పెరుగుతాయోమనని సామాన్యులు భయపడుతున్నారు. అయితే ఈ సారి కేంద్రంలోని బిజెపి సర్కారు కాస్త కరుణించింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరకు రూ 198 తగ్గించింది. దీంతో ఢిల్లిdలో రూ 2219 నుంచి రూ 2021కి పడిపోయింది.
తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో రూ 2426 గా ఉన్న సిలిండర్ ధర రూ 2243 కు చేరింది. అంటే రూ. 183.50 తగ్గింది. ఇక కోల్ కతాలో రూ. 182, ముంబైలో 190.5, ముంబైలో రూ 187 మేర తగ్గాయి. కాగా గత నెల 1న కమర్షియల్ సిలిండర్‌పై రూ 135 తగ్గిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.