Monday, November 18, 2024

కీవ్‌లోనే ఉన్నా, ఏడికీ పారిపోలే.. జెలెన్‌ స్కీ వీడియో విడుదల

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. పోలాండ్‌కు పారిపోయారన్న వార్తలను ఆయన శనివారం తీవ్రంగా ఖండించారు. రష్యా మీడియా ప్రసారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను కీవ్‌లోనే ఉన్నట్టు శనివారం స్పష్టం చేశారు. కీవ్‌ నుంచే సైనికులకు ఆదేశాలు జారీ చేస్తున్నా అని, ఎవరూ ఎక్కడికీ పారిపోలేదంటూ ఓ వీడియోలో తేల్చి చెప్పారు. రష్యా స్పీకర్‌ వ్యాచెస్లావ్‌ వోలోదిన్‌ ప్రకటనలో నిజం లేదన్నారు. ఇన్‌స్టా వేదికగా రష్యాకు జెలెన్‌ స్కీ సమాధానం ఇచ్చాడు. తనను పట్టుకునేందుకు ఎవరూ ప్రయత్నించలేదని, జాడ దొరక్కపోవడంతో పోలాండ్‌లో తలదాచుకున్నాడని వస్తున్న వార్తలను ఖండించారు. తాను పిరికిపందను కానని తేల్చి చెప్పాడు.

మరోవైపు రష్యా పరిణామాలపై అజ్ఞాతంలో ఉంటూనే జెలెన్‌ స్కీ స్పందిస్తున్నాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు, మీడియా ద్వారా పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తులు చేస్తున్నాడు. మరోవైపు ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ మంత్రి దిమిట్రో కులెబా కీవ్‌ నుంచి మాట్లాడారు. తమ దేశంలో ఉద్రిక్తతలు చేయిదాటకముందే తగు చర్యలు తీసుకోవాలని నాటో దేశాలను కోరారు. ఉక్రెయిన్‌ను మరో సిరియాగా మార్చొద్దంటూ అభ్యర్థించారు. ఈ క్రమంలోనే తమ సైన్యం పోరాటం మాత్రమే ఆపేది లేదని.. ప్రతి దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు తమ భాగస్వామ్య దేశాల నుంచి సహకారం అందాలని విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement