Sunday, October 20, 2024

TG | 36 గంటల్లో కిడ్నాప్ కథ సుఖాంతం..

నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కిడ్నాప్‌కు గురైన ఏడాది బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. అపహరణకు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. బిక్షాటన కోసమే బాలుడిని కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సీసీ కెమెరాల ఆధారంగా 36 గంటల్లో కేసులు చేదించిన పోలీసులు బాలుడిని ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించారు.

వ‌న్ టౌన్ ఎస్హె చ్ఓ రఘుపతి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… కామారెడ్డి జిల్లా మద్దూరు మండల కేంద్రానికి చెందిన రాజు, లక్ష్మీ దంపతులు వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసు పత్రికి వచ్చారు. రాత్రి కావడంతో వారి ఇద్ద‌రిపిల్ల‌ల‌తో ఆసుపత్రి ఆవరణలో నిద్రించారు.

వారు గాఢ నిద్రలో ఉండగా నాందేడ్ జిల్లాకు చెందిన అంజుమా వేగం, ఆమె కూతురు, దుర్గారావు బా మెహితే… ముగ్గురు తల్లిదండ్రుల ఒడిలో నిద్రిస్తున్న మణికంఠను ఎత్తుకెళ్లారు. ఈ మహిళలు మణికంఠను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ఆసుపత్రి సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. సదరు మహిళలు బాలుడిని ఎత్తుకెళ్లి ఆటోలో బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్లారు.

నాందేడ్ కు తీసుకువెళ్లేందు కు ప్రయత్నించగా అందుకు సమయం అనుకూలించకపోవడంతో ఆటోలో బాలుడిని నాందేడ్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో సిసి టీవీ ఫుటేజ్ ల ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. బాలుడుని క్షేమంగా తల్లిదం డ్రులకు పోలీసులు అప్పగిం చారు. 36 గంటల్లో కేసును చేదించి బాలుడు కిడ్నాప్ కేసులో చాకచక్యంగా వ్యవ హరించిన ఏఎస్ఐ షకీల్, కానిస్టేబుల్ గంగారాం అనూ ష, కేర్ బాజీ, రాములోని ఎస్హెచ్ఓ అభినందించారు.

బిక్షాటన కోసమే బాలుని కిడ్నాప్ కు కుట్ర..

- Advertisement -

మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో చిన్నపిల్లల చేత భిక్షాటన చేయించి డబ్బులు దండుకుందామనే పక్కా ప్రణాళికతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏడాది బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

మూడు నెలల్లో రెండు కిడ్నాప్ కేసులు..

నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడు నెలల్లో రెండు కిడ్నాప్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. మూడు నెలల క్రితం మాక్లూరు చెందిన మహిళను భర్త, ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆ మహిళకు నాలుగు సంవత్సరాలు కొడుకు ఉండడంతో, కొడుకుతో కలిసి మొదటి అంతస్తులో తండ్రి అదే రోజు రాత్రి నిద్రించాడు. అయితే బుర్క ధరించిన ఇద్దరు వ్యక్తులు తండ్రి పక్కకు పడుకున్న బాలుడిని కిడ్నాప్ చేశారు.

ఉదయం లేచి చూసేసరికి కొడుకు లేకపోవడంతో తండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలును పరిశీలించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేసిన ట్టుగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా కేసు చేదించి బాలుడిని కుటుంబ సభ్యుల కు అప్పగించి, నిందితులను రిమాండ్ కు తరలించారు.

నగరంలో పలు కూడళ్లలో పిల్లలను ఎత్తుకొని బిక్షాటన..

నగరంలో పలు కూడళ్లలో చిన్న పిల్లలను ఎత్తుకొని బిక్షాటన చేస్తున్నారు. పిల్లలని ఎత్తుకొని బిక్షాటన చేస్తున్న వారిని వారి పిల్లలే నా అనే కోణంలో విచారించాల్సిన పోలీసు అధికారులు మొద్దు నిద్రవహిస్తున్నారు. దీంతో కిడ్నాపర్లు తమపని తాము కానిస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ఘటన జరిగినాక హడావిడి చేసే పోలీస్ అధికారులు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.

తల్లిదండ్రులకు కల్లు తాగించి బాలుడు కిడ్నాప్..

నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటేశ్వర్ బైపాస్ వద్ద రెండు సంవత్సరాల క్రితం బాలుడు కిడ్నాప్ గురయ్యాడు. తల్లిదండ్రులకు కల్లు తాగించి గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన అప్పట్లో దుమారం రేపింది. కల్లుబట్టికి కల్లు తాగేందుకు వచ్చిన తల్లికి మాయ మాటలు చెప్పి బాలుడిని ఇద్దరు దుండగులు బైక్ పై ఎత్తుకొని పరారయ్యారు. పోలీసుల గాలింపు చర్యలో భాగంగా దుండగులు, రెండు రోజుల అనంతరం బాలుడిని కోరుట్ల మెట్పల్లి శివారులో పట్టుకొని ప‌ట్టుకున్నారు.

గతంలో కూడా ఇదే తరహాలో…

నిజామాబాద్ నగరంలో గతంలో ఇదే తరహాలో ఓ బట్టల షో రూంలో బాలిక కిడ్నాప్ గురైంది. మెట్పల్లికి చెందిన కుటుంబ సభ్యులు శుభకార్యం నిమిత్తం నగరంలోని ఓ షాపింగ్ మాల్ కు వచ్చారు. బుర్కా ధరించిన మహిళ బాలికను కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్ళింది. కిడ్నాప్ జరిగిన రెండు రోజుల అనంతరం బాలిక ఆచూకీ మహారాష్ట్రలోని నాందేడ్ లో గుర్తించారు. కానీ బుర్కా ధరించిన నిందితురాలని పోలీసుల పట్టుకోలేకపోయారు.

నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర దగ్గరగా ఉండటం, అక్కడి నుంచి మహిళలు వచ్చి పిల్లలను కిడ్నాప్ చేయడం పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్న సంబంధిత పోలీసులు విధులు నిర్వహిస్తున్నారా లేదా అనే అనుమానాలకు తావిస్తున్నాయి. పిల్లలను కిడ్నాప్ చేసి బిక్షాటన పేరిట మాఫియా కుట్ర భాగంగానే ఈ కిడ్నాప్ లు జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement