కారుపై వెళ్తూ దుస్తులు విప్పేశాడు ఓ యువకుడు. ఈ సంఘటన ఘజియాబాద్ జిల్లాలోని రావోలి కలాన్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ తర్వాత స్టంట్స్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఈ యువకుడు పోలీసుల కంట పడ్డాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఘజియాబాద్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కొత్తేం కాదు. ఇటీవల కాలంలో చాలా మంది యువకులు భయంకరమైన స్టంట్స్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. స్టంట్స్ చేసే యువకులకు కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement