గగనతలంలో ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఆమెరికాలోని పోర్ట్ లాండ్ నుంచి ఒంటారియాకు బయలుదేరేందుకు విమానం టేకాఫ్ అయింది. గాలిలోకి లేచిన కొద్ది సమయంలోనే విమానం డోర్ ఊడిపోయింది.
దాంతో ప్రయాణీకులు తీవ్ర భయభ్రాంతులకులోనయ్యారు. అప్రమత్తమైన ఫైలేట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.దీంతో ప్రయాణీకులంతా ఊపీరి పీల్చుకున్నారు. ఊడిన డోర్ పక్కనే ప్రయాణికుల సీట్లు ఉన్నాయి. కొందరి ఫోన్లు బయటకు ఎగిరి పడ్డాయి.
అసలు ఏం జరిగిందంటే..
‘AS1282 విమానం పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియో బయలుదేరిన కొద్దిసేపటికే సమస్య తలెత్తింది. దాంతో విమానాన్ని వెనక్కి మళ్లించి.. సురక్షితంగా ల్యాండ్ చేశాం. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం’ అని అలస్కా ఎయిర్‌లైన్స్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దీనిపై యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(ఎన్‌టీఎస్‌బీ) కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.