తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టులో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో దాదాపు మూడు గంటలపాగు గాల్లోనే చక్కర్లు కొట్టిన ఎయిరిండియా బోయింగ్ విమానం…. తిరుచ్చి ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో ఆ విమానంలోని 141 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
తిరుచిరాపల్లి నుంచి షార్జాకు వెలుతున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ 613 విమానంలో హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరికి పైలెట్లు విమానాన్ని రాత్రి 8 గంటల 14 నిమిషాలకు సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు, ఎయిర్ పోర్టు సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, ఈ ఘటనను సివిల్ ఏవియేషన్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలేం జరిగింది? ఎందుకీ సమస్య తలెత్తింది? అనే వివరాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ 613 విమానం తిరుచిరాపల్లి నుండి షార్జాకు బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కొంతసేపటికే హైడ్రాలిక్ సమస్య తలెత్తింది.