Thursday, July 4, 2024

Plane Crash: పారిస్ లో కూలిన విమానం.. ముగ్గురి మృతి..

చిన్న విమానం ఒకటి నడి రోడ్డుపై కుప్పకూలిన ఘ‌ట‌న పారిస్ లో చోటుచేసుకుంది. తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. గాయాలపాలైన మిగతా వారిని రెస్క్యూ సిబ్బంది ఎయిర్ ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

పారిస్ లోని డిస్నీల్యాండ్ సమీపంలో ఏ4 మోటార్ వే పై చిన్న ప్యాసింజర్ విమానం కూలిపోయింది. తలకిందులుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుంది. గాయాలపాలైన వారిని ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఏ4 మోటార్ వే పై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement