రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 65 మంది యుద్ధ ఖైదీలతో వెళ్తున్న రష్యా విమానం కుప్పకూలింది. క్రాష్ తర్వాత విమానం మంటల్లో చిక్కుకుంది. రష్యాకు చెందిన IL-76, హెవీ లిఫ్ట్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ 65 మంది ఉక్రెయిన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్స్(పీఓడబ్ల్యూఎస్)తో ప్రయాణిస్తున్న సమయంలో రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయింది.
ప్రమాదం సమయంలో విమానం నేరుగా భూమి వైపు దూసుకువస్తుండటం కనిపిస్తుంది. ఈ దృశ్యాలను చూస్తే విమానం పైలట్ నియంత్రణలో లేనట్లుగా ఉంది. విమానం కూలిన ఘటనను రష్యా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ ఘటనలో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పట్టుబడిన 65మంది ఉక్రెయిన్ సైనికులను, యుద్ధ ఖైదీల మార్పిడి కోసం బెల్గోరోడ్ ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న యుద్ద ఖైదీలు 65 మందితో పాటు సిబ్బంది తొమ్మిది మంది కూడా మృత్యువాత పడ్డారు.