Saturday, November 23, 2024

ఫార్మసీ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలి.. 33 జిల్లాల ఫార్మాసిస్టుల సంఘం డిమాండ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలని తెలంగాణ ఫార్మసిస్టుల సంఘం డిమాండ్‌ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మాసిస్టులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం నిజాం కాలేజీలో రాష్ట్ర వ్యాప్త ఫార్మిసిస్టుల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లాకు ఇద్దరు చొప్పున 33 జిల్లాలకు 66 మంది ఫార్మాసిస్టులను నియమించాలని, ఖాళీగా ఉన్న 13 డ్రగ్‌ ఇన్స్‌ పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయాలని, ఫార్మాసిస్టుల కనీస వేతనం రూ.30వేలుగా నిర్ణయించాలని, ఫార్మసీని స్తాపించేందుకు ఫార్మాసిస్టులకు రూ.5లక్షల రుణం ఇవ్వాలని నేతలు డిమాండ్‌ చేశారు.

ఫార్మాసూటికల్‌ కంపెనీని స్థాపించేందుకు ఫార్మాసిస్టులకు రూ. 1కోటి రుణం ఇవ్వాలని నేతలు ఆకుల సంజయ్‌రెడ్డి, చంద్రశేఖర్‌ఆజాద్‌, వీరారెడ్డి, తిరుమలరావు, సాకేత్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఫార్మసీ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని, ఫార్మసీ చట్టం 1948, ఔషధ చట్టం 1940ను తూచా తప్పకుండా అమలు చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement