Friday, November 22, 2024

అత్యంత ఎత్తయిన గోల్డెన్‌ జాయింట్‌ బ్రిడ్జ్‌ ప్రారంభం.. ప్రపంచంలో ఎత్తయిన రైల్వే బ్రిడ్జిగా రికార్డు..

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి గోల్డెన్‌ జాయింట్‌ చినాబ్‌ బ్రిడ్జి శనివారం ప్రారంభమైంది. ఆర్చ్‌ ఆకారంలో నిర్మించిన ఈ గోల్డెన్‌ జాయింట్‌ బ్రిడ్జి ఎత్తు ఈఫిల్‌ టవర్‌ కంటే 35 మీటర్లు ఎక్కువ. ఈ బ్రిడ్జి 1,315 కిమీ పొడవుతో ప్రపంచంలోని రెండు అత్యంత ఎత్తయిన ప్రాంతాలు కత్రా నుంచి బనిహాల్‌ను అనుసంధానం చేసింది. కశ్మీర్‌ రైల్వే ప్రాజెక్టుల్లో భాగంగా ఉధంపూర్‌ – శ్రీనగర్‌ – బారాముల్లా విభాగానికి చెందిన చినాబ్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. సుమారు 1300 మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు నిరంతరం పని చేసి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. ఇది సముద్రమట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈఫిల్‌ టవర్‌ కంటే 35 మీటర్ల ఎత్తుతో చినాబ్‌ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. 28,660 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌, 10 లక్షల సీయుఎం ఎర్త్‌ వర్క్‌, 66 వేల సీయుఎం కాంక్రీట్‌, 26 కిమీ మోటారోబల్‌ రోడ్డు ఉంది. ఈ ఆర్చ్‌ బ్రిడ్జిలో 10,619 మెట్రిక్‌ టన్నుల స్టీలు బాక్స్‌లను ఏర్పాటు చేశారు.

ఈ బ్రిడ్జిపై గంటకు 30కిమీ వేగాన్ని పరిమితం చేయడడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.1,486 కోట్ల వ్యయమైంది. ఈ బ్రిడ్జి సుమారు 120 సంవత్సరాల పాటు పటిష్టంగా ఉంటుంది.ఈ బ్రిడ్జి కోసం జమ్ము తావి నుంచి న్యూఢిల్లిd వరకు 584 కిమీ ల దూరం వెల్డింగ్‌ వర్క్‌ జరిగింది. యూపీఏ -1 గవర్నమెంట్‌ హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణం 2004లో ప్రారంభమైంది. అత్యంత ఎత్తయిన ప్రదేశం కనుక ప్రయాణీకులకు ఆరోగ్యపరమైన భద్రతా చర్యలు తీసుకోవడానికి 2008-09 మధ్య కాలంలో పనులను నిలిపి వేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement