హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: కరీంనగర్ మైనింగ్ కేసులో ఈడి విచారణ కొనసాగుతోంది. మైనింగ్ అక్రమాలపై తొమ్మిది కంపెనీలకు నోటీసులివ్వగా, ఇప్పటికి పదిమందిని ఈడి అధికారులు విచారించారు. ఈనెల 9,10 తేదీలలో 30 ప్రాంతాల్లో ఈడి సోదాలు నిర్వహించి, పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. రూ.750కోట్ల అక్రమాలపై ప్రధానంగా ఈడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. అక్రమ మైనింగ్ ద్వారా వందలకోట్ల ఆదాయానికి గండికొట్టారన్న ఫిర్యాదులపై ఈ విచారణ సాగినట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement