Monday, November 25, 2024

Big Story | తెలంగాణకు సరిపోని ఐఏఎస్‌ల సంఖ్య.. అయినా పట్టని కేంద్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పెరిగిన కొత్త జిల్లాలకు ధీటుగా అఖిలభారతస్థాయి అధికారులను కేటాయించడంలో విఫలమైన కేంద్రం తెలంగాణకు కొత్త కేటాయింపులు చేయకపోగా కేటాయించకపోగా, ఉన్న అధికారులనే కేంద్ర సర్వీసులకలోకి డిప్యుటేషన్ల పేరుతో తీసుకుంటోంది. ఇప్పటికే తెలంగాణలో నిర్దేశిత కోటాలో ఆల్‌ ఇండియా అధికారుల కోటాను కేంద్రం పూర్తి చేయలేదు. దీంతో ఉన్న అధికారులతోనే తెలంగాణ సర్కార్‌ నెట్టుకొస్తున్నది. ఇటీవలే కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లనిచ్చి పాలనలో వేగం పెంచింది. జిల్లాకు ఇద్దరేసి అదనపు కలెక్టర్లను నియమించడంలో భాగంగా నాన్‌ ఐఏఎస్‌లను నియమిస్తున్నది.

ఇక అనేక రాష్ట్రాల్లో అధికారుల కొరత తీవ్రంగా ఉందని, ఈ తరుణంలో కొత్తగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పేరుతో కొత్త జిల్లాలు ఏర్పాటు పట్ల కొంత అయిష్టత వ్యక్తం చేసిన కేంద్రం తెలంగాణ స్థానిక పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారడాన్ని గమనించింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో అధికారుల కొరత ఉండగా మరోవైపు కొందరు అధికారులు కేంద్ర సర్వీసుల దిశగా దృష్టిసారించడం ఇబ్బందులను సృష్టిస్తోంది. తాజాగా నలుగురు సీనియర్లను కేంద్రం డిప్యుటేషన్ల పేరుతో కేంద్ర సర్వీసులకు తీసుకున్నది. వీరు రానున్న ఐదేళ్లపాటు కేంద్ర సర్వీసులో విధులను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఒకవైపు శాసనసభ ఎన్నికలు జరగనుండగా ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఐఏఎస్‌ల కొరత ఇబ్బందులను సృష్టించనుంది.

- Advertisement -

తాజాగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతు కుమారి ప్రసాద్‌( 2001 బ్యాచ్‌), సౌసమీ బసు(2007 బ్యాచ్‌), రజత్‌కుమార్‌ షైనీ( 2007 బ్యాచ్‌), శ్వేతామహంతి( 2011బ్యాచ్‌)లను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లిdలోని క్యాబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యుటీ సెక్రటరీగా శ్వేతామహంతిని నియమించగా, ఫిషరీస్‌ శాఖ జాయింట్‌ సెక్రటరీగా నీతూ కుమారి ప్రసాద్‌ను, పౌసమీ బసును కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీగా, రజత్కుమార్‌ షైనీనినేషనల్‌ ఇండస్ట్రీయలఖ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈవో, ఎండీగా నియమించారు. తెలంగాణకు కేంద్రం 163 పోస్టులను కేటాయించగా ప్రస్తుతం 140 మంది ఐఏఎస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.

కేంద్ర సర్వీసుల్లో 25 మంది సీనియర్లు…

ప్రతీ ఐఏఎస్‌ అధికారి తన సర్వీసులో భాగంగా కేంద్ర సర్వీసుల్లో పనిచేయాలని, తెలంగాణ రాష్ట్రంనుంచి 25కుపైగా అధికారులను డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఈ లేఖపై అధికారులెవరూ పెద్దగా ఆశక్తి చూపలేదు. అప్పట్లోనే తెలంగాణ జీఏడి ఈ లేఖ ఆధారంగా ఐఏఎస్‌లకు లేఖలు రాసి వారి అభిప్రాయాలను సేకరించింది. అయితే ఎవరెవరు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు సమ్మతించారనే సమాచారం ప్రభుత్వానికి చేరలేదు. మరోవైపు కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్లు కూడా తిరిగి రాష్ట్రానికి రానున్నారని ప్రభుత్వం భావించింది.

ఇంచార్జీ తిప్పలు…

మరోవైపు పాలనకు కీలకమైన శాఖలను ఇంచార్జీలు నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా రాష్ట్రంలో ఐఏఎస్‌లు 107, ఐపీఎస్‌లు 79, ఐఎఫ్‌ఎస్‌లు 49గా లెక్కలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నంతలో సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇండియన్‌ రైల్వేస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌, ఇండియన్‌ రైల్వేస్‌ ట్రాఫిక్‌ సర్వీస్‌, ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌, ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ వంటి అఖిలభారత సర్వీస్‌ అధికారులను రాష్ట్రానికి రావాలని కోరేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు సెంట్రల్‌ డిప్యుటేషన్‌లో ఉన్న ఆయా విభాగాల అధికారుల వివరాలను కూడా సేకరించింది. కొందరు రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత తెలిపారని, వారి వివరాలను డీఓపిటికి పంపనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement