Friday, November 22, 2024

దేశంలో లక్షల్లో …తెలంగాణలో వేలల్లో – మరణమే ఇది!!

దేశంలో కరుణ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 3,46,786 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా 2,624మందిని కరోనాతో మృతి చెందారు.తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,66,10,481కి చేరింది. మరణాలు 1,89,544గా రికార్డయ్యాయి. మరోవైపు 24 గంటల్లో 2,19,838 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక మొత్తం ఇప్పటివరకు 13,83,79,832మందికి టీకాలు వేశారు.

ఇదిలా ఉండగా తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కొత్త పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 7432మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే 33 మంది చనిపోయారు. ఇక తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,87,106మందికి చేరింది.అలాగే అందులో 3,26,997మంది డిశ్చార్జ్ అయ్యారు.మరోవైపు ఇప్పటి వరకు 1,961మంది మ‌ర‌ణించారు.

కొత్త‌గా నమోదు కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 1464, కొత్తగూడెం 213, అదిలాబాద్ 121, జ‌గిత్యాల 185, కామారెడ్డి 247, ఖ‌మ్మం 325, మంచిర్యాల 222, మేడ్చ‌ల్ 606, న‌ల్గొండ 122, నిజామాబాద్ 486, సిద్దిపేట 192, వ‌రంగ‌ల్ అర్భ‌న్ 323, వ‌రంగ‌ల్ రూర‌ల్ 122, భువ‌న‌గిరి 147లు కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement