Tuesday, November 26, 2024

అమృత్‌సర్‌లో డ్రోన్ల కలకలం.. రెండు సార్లు ప్రవేశించేందుకు యత్నం

అమృత్‌సర్‌ : పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఓ డ్రోన్‌.. అమృత్‌సర్‌లోని సుందర్‌గడ్‌ ప్రాంతంలో కలకం సృష్టించింది. సోమవారం మరోసారి పాకిస్తాన్‌ నుంచి ఓ డ్రోన్‌ భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఉదయం 11.45 నిమిషాలకు, మళ్లిd మధ్యాహ్నం సమయంలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఒకే రోజు రెండు సార్లు భారత్‌లోకి చొరబడేందుకు డ్రోన్లు ప్రయత్నించాయి. తొలుత ఉదయం డ్రోన్‌ భారత్‌ భూభాగంలోకి రావడాన్ని గమనించి.. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఫైరింగ్‌ చేశారు.

దీంతో అది పాకిస్తాన్‌ వైపు వెనుదిరిగింది. దీంతో అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు.. అబ్జివింగ్‌ పోస్టు (బీఓపీ) సుందర్‌గడ్‌ వద్ద తనిఖీలు చేపట్టగా ఏమీ లభ్యం కాలేదు. అజనాలా వద్ద బీఎస్‌ఎఫ్‌ 183 బెటాలియన్‌ బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పహారా కాస్తున్నారు. మళ్లిd మధ్యాహ్న సమయంలో డ్రోన్‌ చొరబడేందుకు ప్రయత్నించగా.. జవాన్లు వాటిపై కాల్పులు జరిపారు. మళ్లిd ఆ డ్రోన్‌ పాకిస్తాన్‌ వైపు వెళ్లిపోయింది. సుందర్‌గడ్‌ ప్రాంతాన్ని పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు క్షుణ్ణంగా పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement