Friday, November 22, 2024

కోవిడ్‌ తొమ్మిదో వేవ్‌.. యూకేలో వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌

ఎరిస్‌ పేరిట ఒక సరికొత్త కోవిడ్‌ వేరియంట్‌ యూకేలో శరవేగంతో విస్తరిస్తోందని యూకే ఆరోగ్య భద్రత ఏజెన్సీ(యూకేహెచ్‌ఎస్‌ఏ) హెచ్చరించింది. దేశంలో ప్రతి ఏడు కోవిడ్‌ కేసుల్లో ఒకటి ఎరిస్‌ కారణంగా పుట్టుకొచ్చిందని పేర్కొంది. జులైలో వెలుగులోకి వచ్చిన ఎరిస్‌.. అర్క్‌టురుస్‌ తర్వాత అత్యంత వేగంతో విస్తరించే వేరియంట్‌గా ఆందోళన కలిగిస్తోంది.

కోవిడ్‌ తొమ్మిదో వేవ్‌ అన్నట్టుగా ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా, జపాన్‌లలో తన ఉనికిని ఎరిస్‌ చాటుకుంటోంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి గతవారం పరీక్షలు చేపట్టగా వారిలో దాదాపు 5.4 శాతం మందికి కోవిడ్‌ సోకినట్టుగా తేలింది. అంతకుముందు వారంలో 3.7 శాతం మందికి సోకిన వైనంతో పోలిస్తే కోవిడ్‌ కేసుల్లో ఇది ప్రమాదకరమైన పెరుగుదలగా ఏజెన్సీ చీఫ్‌ డాక్టర్‌ మేరీ రామ్‌సే తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement