మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 కొన్ని రోజుల క్రితం ముగిసింది. అయితే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కంపెనీలు ఈ నెల (మార్చి) అంతటా కొత్త ఫోన్‌లను మార్కెట్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాయి. వీటిలో మీడియం బడ్జెట్ నుండి హై ఎండ్ ఫ్లాగ్‌షిప్ ల వరకు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి. దాదాపు 11 బ్రాండ్‌లు కొత్త ఫోన్‌లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా రిలీజ్ కానున్న ఫొన్లలో ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై అఫిషియల్ అప్డేట్స్ కూడా వచ్చేశాయి. కానీ, ఈ హ్యాండ్‌సెట్‌లు చాలా వరకు సరికొత్తవి. వాటిలో కొన్ని ఎంతగానో ఎదురుచూస్తున్న Oppo Find X6 సిరీస్ & Redmi Note 12 Turbo వంటి స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. మరి మార్కెట్ లో రిలీజ్ కానున్న ఈ సరికొత్త ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఏంలో ఒక్కొక్కటిగా చూద్దాం.
మార్చి లో రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!
1.Oppo Find N2 ఫ్లిప్
దేశంలో మొదటి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర, లభ్యతను మార్చి 13న వెల్లడించనుంది. ఈ ఫోన్‌లో 6.8-అంగుళాల 120Hz LTPO ఫోల్డబుల్ డిస్‌ప్లే, 3.26-అంగుళాల కవర్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్‌సెట్, 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, 4,300mAh బ్యాటరీ & 44W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
2.Poco X5
ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 14న ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ కానుంది. 6.67-అంగుళాల 120Hz AMOLED డిస్ప్లే, 48MP ప్రధాన కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000mAh బ్యాటరీ & 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
3.Samsung Galaxy A54 & Galaxy A34
దేశంలో ఈ హ్యాండ్‌సెట్‌లు మార్చి 16న రిలీజ్ కానున్నట్టు అధికారికంగా ధృవీకరించబడ్డాయి. A34 6.6-అంగుళాల డ్యూడ్రాప్-నాచ్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్ మరియు 48MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. A54 చిన్న 6.4-అంగుళాల కేంద్రీకృత పంచ్-హోల్ డిస్‌ప్లే, Exynos 1380 SoC మరియు 50MP ప్రధాన కెమెరాతో వస్తుంది.
4.iQOO Z7
మార్చి 21న భారతదేశంలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేయబడింది. బ్రాండ్ ఇప్పటికే ఈ ఫోన్ కి సంబందించిన అన్ని కీలక వివరాలను ధృవీకరించింది. Z7 డైమెన్సిటీ 920 చిప్‌సెట్, AMOLED డిస్‌ప్లే, OIS-సపోర్ట్ 64MP ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఆధారంగా Funtouch OS 13 & 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 6GB + 128GB స్టోరేజ్ గల ఈ స్మార్ట్‌ఫోన్ రూ.17,999గా నిర్ణయించబడింది. అంతే కాకుండా, ఈ ఫోన్ 8GB + 128GB మెమరీ కాన్ఫిగరేషన్ తో రెండు రంగులలో (పసిఫిక్ నైట్ మరియు నార్వే బ్లూ) కూడా రానున్నట్టు తెలు్స్తోంది.
5.Vivo Y11
ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి చివరి నాటికి చైనాలో లాంచ్ కానుంది. ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్‌లలోకి ప్రవేశించనుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల FHD+ డిస్ప్లే (LCD), మీడియాటెక్ చిప్‌సెట్, 4GB RAM, 128GB స్టోరేజ్, మైక్రో SD కార్డ్ స్లాట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 5,000mAh బ్యాటరీ & 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని భావిస్తున్నారు.
6.Redmi Note 12 Turbo
ఈ ఫోన్ చైనాలో మార్చి చివరి నాటికి విడుదల కావచ్చు. తరువాత ఇతర మార్కెట్లలో Poco F5గా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 6.67-అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్, 5,000mAh బ్యాటరీ, 67W ఛార్జింగ్ సపోర్ట్ & ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14తో వస్తుంది.
7.Redmi A2, Redmi A2 +
మార్చి చివరి నాటికి Redmi A2 & Redmi A2 ప్లస్ ఫోన్ లను లాంచ్ చేసే చాన్స్ ఉంది. Redmi A1 మరియు Redmi A1 ప్లస్ దాదాపు ఒకే విధమైన ఫీచర్లతో వస్తాయి. 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లే, 8MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్, 5,000mAh బ్యాటరీ & 10W ఛార్జింగ్ సపోర్ట్‌ను చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రెడ్‌మి ఎ2 ప్లస్‌లో వెనుకవైపున మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
8.Realme GT Neo 5 SE & Realme C55
మార్చి నెలాఖరులోగా అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. 6.74-అంగుళాల 2K 144Hz OLED డిస్‌ప్లే, 64MP (వెడల్పు) + 8MP (అల్ట్రా-వైడ్) + 2MP (మాక్రో) ట్రిపుల్ కెమెరా సిస్టమ్, 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, Android 13-ఆధారిత ColorOS 13, 5,500mAh బ్యాటరీ & 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
Realme C55 ఇటీవలే ఇండోనేషియాలో విడుదలైంది. ఇది మరి కొద్ది వారాల్లో ఇతర మార్కెట్‌లలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రాథమిక ఫీచర్లలో MediaTek Helio G88 చిప్, 6.72-అంగుళాల 90Hz డిస్ప్లే (LCD), iPhone 14 ప్రో లాంటి డైనమిక్ ఐలాండ్ ఫంక్షనాలిటీ, 64MP ప్రధాన కెమెరా & 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
9.Infinix హాట్ 30 సిరీస్
మార్చి ముగిసేలోపు లాంచ్ అవ్వచ్చు. ఈ సిరీస్‌లో Infinix Hot 30, Infinix Hot 30i & Infinix Hot 30 Play వంటి హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. హాట్ 30 & హాట్ 30i లు ఒకేలా కనిపిస్తాయి. హాట్ 30i 6.6-అంగుళాల HD+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G37 చిప్, 50MP ప్రధాన కెమెరా, ఆండ్రాయిడ్ 12, 5,000mAh బ్యాటరీ & 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
10.Oppo Find X6
ఈ నెలాఖరులో లాంచ్ అవుతుందని అంచనా. ఇది మార్చి 21న అధికారికంగా వెళుతుందని బజ్ ఉంది. ఎప్పటిలాగే, లైనప్‌లో Oppo Find X6 & Oppo Find X6 Pro రెండు మోడల్‌లు ఉంటాయి.
11.Huawei P60
మార్చి 23న అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. లైనప్‌లో Huawei P60, Huawei P60 Pro & Huawei P60 అల్ట్రా వంటి మూడు హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. కంపెనీ యొక్క అంతర్గత XMAGE ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా ఆధారితమైన కెమెరాలతో రానున్నట్టు తెలుస్తోంది. కానీ, USలో నిషేధం కారణంగా తాజా Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌ని కలిగి ఉన్నప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్‌లు 4G కనెక్టివిటీకే పరిమితం చేయబడతాయి.
12.Meizu 20
మార్చి ముగిసేలోపు అధికారికంగా లాంచ్ అవ్వచ్చు. లైనప్ లో Meizu 20 & Meizu 20 Pro వంటి రెండు ఫోన్‌లను కలిగి ఉంటుందని అంచనా. వీటి డిజైన్ Galaxy S23 సిరీస్ నుండి ప్రేరణ పొందినట్టు తెలుస్తోంది. ప్రో వేరియంట్ QHD+ 120Hz LTPO AMOLED డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్, LPDDR5x RAM, UFS 4.0 స్టోరేజ్, 50MP ప్రైమరీ కెమెరా, 5,000mAh బ్యాటరీ మరియు 80W వైర్‌లెస్/50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుందని అంచనా.