Saturday, November 23, 2024

గూగుల్ నుంచి మార్కెట్ లోకి సరికొత్త పిక్సెల్ టాబ్లెట్.. వివరాలివే!

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్, తమ బ్రాండ్ నుంచి సరికొత్త పిక్సెల్ టాబ్లెట్ ను గూగుల్ ఐ/ఓ ఈవెంట్ లో రిలీజ్ చేసింది. గూగుల్ ఐ/ఓ ఈవెంట్ లో టాబ్లెట్ తో పాటు గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్ ఫోన్ & పిక్సెల్ ఫోల్డ్ ను కూడా విడుదల చేసింది. ఈ టాబ్లెట్ టెన్సర్ జీ 2 ఎస్ఓసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. గూగుల్ పిక్సెల్ టాబ్లెట్ 128 జీబీ బేస్ మోడల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉంటుంది. ఇక గూగుల్ పిక్సెల్ టాబ్లెట్ ప్రారంభ ధర 499 డాలర్లు (ఇండియ‌న్ క‌రెన్సీలో దాదాపు రూ. 43,000) గా ఉంది.

గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ అత్యంత మన్నికైన హింజ్ మెటీరియల్ తో వస్తుందని గూగుల్ పేర్కొంది. ఇది బయటవైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఐపీఎక్స్ 8 వాటర్ రెసిస్టెంట్ డిజైన్ ను కూడా కలిగి ఉంటుంది. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ధర విషయానికి వస్తే, గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ ధర 1,799 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.1,45,000). ఇది బ్లాక్, వైట్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. పిక్సెల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి గూగుల్ ఉచితంగా పిక్సెల్ వాచ్ ను కూడా అందిస్తుంది.

వ‌చ్చే నెల అంటే జూన్ 20 నుంచి ఈ ట్యాబ్లెట్ అమ్మకాలు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. ఈ టాబ్లెట్ అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్, జపాన్, ఆస్ట్రేలియాలతో పాటు వివిధ దేశాల్లో ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉందని గూగుల్ ప్రకటించింది. అయితే ఈ టాబ్లెట్ మన దేశంలో ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.

గూగుల్ పిక్సెల్ టాబ్లెట్ స్పెసిఫికేషన్స్..

- Advertisement -

11 ఇంచ్ ఎల్సీడీ డిస్ ప్లే

2560×1600 ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్

60 హెర్ట్జ్ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం

టచ్ సపోర్ట్

టెన్సర్ జీ 2 ఎస్ఓసీ ప్రాసెసర్

ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

వెనుక వైపు 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా

క్వాడ్ స్పీకర్ సెట్ అప్

ఫింగర్ ప్రింట్ స్కానర్

యుఎస్బీ-టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్

27 వాట్ బ్యాటరీ సపోర్ట్

12 గంటల ప్లేబ్యాక్ టైమ్

గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫీచర్లు..

ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 7.69 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ ప్లే

ఫోన్ క్లోజ్ చేసినప్పుడు 5.79 ఇంచ్ డిస్ ప్లే

120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

గూగుల్ టెన్సర్ జీ2 చిప్ సెట్

12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం

వెనుక వైపు 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 10.8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10.8 మెగా పిక్సెల్ టెలిఫోటోస్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్

ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8.3 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

* 4800 ఎంఏహెచ్ బ్యాటరీ

* యూఎస్బీ టైప్-సీ పోర్ట్

* వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement