Friday, November 22, 2024

Delhi: బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు…

కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్ నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా వీరు ఈసీఐలో చేరారు. కమిషనర్లుగా శుక్రవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్‌ కుమార్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఉన్నారు. కమిషనర్‌గా ఉన్న అనూప్‌ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ ఇటీవలే అనూహ్యంగా రాజీనామా చేశారు.

దీంతో కొత్త కమిషనర్ల నియామకం అనివార్యమైంది. గురువారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ కొత్త కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్‌ సింధూ, జ్ఞానేశ్‌ కుమార్‌లను ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా వీరు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు.

కేరళకు చెందిన కుమార్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన సంధూ ఇద్దరూ 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సందర్భంలో కుమార్‌ హోంమంత్రిత్వ శాఖలో సేవలు అందించగా, సంధూ గతంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా వ్య వహరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement