Monday, November 18, 2024

మామకి మేనల్లుడి మీద ప్రేమ…వాడికి మాత్రం వాళ్ళ ఆవిడ మీద ప్రేమ !!

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఐదు నిమిషాల సుఖం కోసం జీవితాలనే పోగొట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లా లో ధరూరు మండలం మార్లబీడు గ్రామానికి చెందిన బంట్రోతు రంగారెడ్డి వయసు 32 సంవత్సరాలు. ఇటీవల తన భార్య చనిపోవడంతో ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. రంగారెడ్డి వృత్తిరీత్యా తాపీ పని కి వెళ్తూ ఉంటాడు. అయితే మరోవైపు తన తోడబుట్టిన అక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారడంతో తన మేనల్లుడిని ఇంటికి తెచ్చుకున్నాడు. మేనల్లుడు కి సంబంధించిన అన్ని బాగోగులు తానే చూసుకుంటున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది.

ఆ మేనల్లుడు తో రంగారెడ్డి రెండో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన రంగారెడ్డి ఇద్దరిని హెచ్చరించాడు. అయినా వాళ్ళ తీరు మారలేదు. అడ్డుగా ఉన్న రంగారెడ్డి ని హత్య చెయ్యాలని భావించారు. మద్యం తాగి ఉన్న రంగారెడ్డి పడుకున్న సమయంలో ఇద్దరూ కలిసి గొడ్డలితో దాడి చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ఉంచారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement