Saturday, November 23, 2024

సొంతంగా సినిమాలు తీసి.. చేతులుకాల్చుకున్న సినీతారలు!

సినిమా రంగంలో హీరోలు చిత్ర నిర్మాణంపట్ల ఆసక్తి చూపించేవారు. తాము బిజీగా ఉన్నప్పటికీ సొం త నిర్మాణ సంస్థను నెలకొల్పి సినిమాలుు తీసేవారు. ఎన్టీఆర్‌, అక్కినేని, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు వంటి హీరోలు వరుస సినిమాలు తీశారు. వీరితో పోలిస్తే హీరోయిన్లు మాత్రం చిత్ర నిర్మాణం పట్ల చూపే ఆసక్తి అంతంతమాత్రమే. భానుమతి రామకృష్ణ మాత్రమే నిర్మాతగా కూడా కొంతమేర సక్సెస్‌ అయ్యారు. మిగతా హీరోయిన్లు మాత్రం సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారని చెప్పవచ్చు.
చాల మంది హీరోయిన్లు డబ్బులు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. హీరోయిన్లకు సినిమా నిర్మాణం కలిసిరాలేదనే చెప్పాలి. ఈ అనుభవాల దృష్ట్యా చాలా మంది చిత్ర నిర్మాణం జోలికి వెళ్లడం లేదు.

ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్‌ భారీ నష్టాలను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణంలో ఒకప్పటి నటి ఛార్మి భాగస్వామి. గతంలో సినిమాలు నిర్మించిన హీరోయిన్ల గురించి ఒకసారి పరిశీలిస్తే మహానటి సావిత్రి చిన్నారి పాపలు అనే సినిమాతో ఓ ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమా వల్ల ఆమెకు చాలా నష్టం జరిగిందని అంటారు.

జయసుధ: సహజనటి జయసుధ సుదీర్ఘ కెరీర్‌ ఉన్న నటి. సినిమా నిర్మాణం పట్ల అవగాహన ఉంది. భర్త నితిన్‌ డి.కపూర్‌తో కలిసి కాంచన సీత, కలికాలం, వింత కోడళ్ళు, ఆదిదంపతులు, హ్యాండ్సప్‌ వంటి చిత్రాలు నిర్మించారు. ఇవేమి ఆమెకు ఆర్థికంగా లాభసాటి కాలేదు. పైగా నష్టాలు తెచ్చిపెట్టాయి.

భూమిక: ఖుషీ సినిమాతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఒకవైపు నాయికగా కెరీర్‌ కొనసాగిస్తూనే భర్త సహకారంతో ‘తకిట తకిట’ పేరుతో చిత్రాన్ని నిర్మించి నష్టపోయారు.

కళ్యాణి: ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కల్యాణి సైతం చిత్ర నిర్మాణంవైపు మొగ్గుచూపింది. ఈమె కే2కే ప్రొడక్షన్స్‌ అనే బ్యానర్‌ను స్థాపించి ఓ ద్విభాషా చిత్రాన్ని నిర్మిం చడం జరిగింది.

- Advertisement -

విజయశాంతి: హీరోలకు ధీటుగా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న నటి విజయశాంతి. మాస్‌ నాయి కగా పేరు తెచ్చుకున్నాక భర్త ప్రోత్సాహంతో నిర్మాతగా మారింది. తొలుత బాలకృష్ణతో నిప్పురవ్య సినిమా నిర్మించింది. ఆ తర్వాత దాసరి నారాయ ణరావు దర్శక త్వంలో అడవిచుక్క చిత్రాన్ని సైతం విజయశాంతి నిర్మించింది. ఈ సినిమాల ఫలితం నిరాశపరిచిందని చెప్పవచ్చు.

మంజుల ఘట్టమనేని: మంజుల ‘షో’ చిత్రంలో హీరోయిన్‌ గా నటించడంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా జరిగింది. ఆ తర్వాత మహేష్‌ బాబు హీరోగా ‘నాని’ చిత్రాన్ని కూడా నిర్మించారు.. ఆ తర్వాత ‘కావ్యాస్‌ డైరీస్‌’ చిత్రాన్ని తీశారు.

రోజా: ఈమె తన భర్త సెల్వమణి దర్శకత్వం వహించిన ‘సమరం’ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. ‘లాఠీచార్జ్‌’ అనే చిత్రం కూడా తీశారు.

హీరోలు తమను తాము ప్రమోట్‌ చేసుకోవడం కోసం లేదా తాము ఇష్టపడే పాత్రలు వేయడం కోసం నిర్మాతలుగా మారుతారు. హీరోయిన్ల విషయానికి వస్తే వీరి ఉద్దేశం వేరు. రెగ్యులర్‌ నిర్మాతల్లా రాణించాలనే ఆసక్తి వారిలో కనిపిస్తుంది. సినిమా రంగం అంటేనే అది ఒక బిజినెస్‌ అనే చెప్పాలి. బిజినెస్‌లో లాభాలు, నష్టాలు సర్వసాధారణం. ఏ బిజినెస్‌లోనైనా లాభాలు నష్టాలు ఊహించవచ్చు కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement