Thursday, November 21, 2024

మోస్ట్‌ పాపులర్‌ వరల్డ్‌ లీడర్‌ మోడీ.. వరుసగా మూడోసారీ నెంబర్‌ వన్‌ రేటింగ్‌

మోస్ట్‌ పాపులర్‌ వరల్డ్‌ లీడర్‌గా వరుసగా మూడోసారి కూడా ప్రధాని నరేంద్రమోడీనే ఎంపికయ్యారు. 22 మంది వరల్డ్‌ లీడర్స్‌పై మార్నింగ్‌ కన్సల్ట్‌ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 75 శాతం రేటింగ్‌తో మోస్ట్‌ పాపులర్‌ వరల్డ్‌ లీడర్‌గా ప్రధాని మోడీ ఎంపికయ్యారు. మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ ఈ ఏడాది జనవరి, 2021 నవంబర్‌లో నిర్వహించిన సర్వేల్లో సైతం ప్రధాని నరేంద్రమోడీనే మోస్ట్‌ పాపులర్‌ వదల్డ్‌ లీడర్‌గా ఎంపికయ్యారు. ప్రధాని మోడీ తర్వాత, రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయేల్‌ లోపెజ్‌ ఒబార్డర్‌, మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మేరియో డ్రాగ్హిలు ఉన్నారు.

వారికి 63 శాతం, 54 శాతం రేటింగ్‌ లభించింది. ఇరవై రెండు మంది ప్రపంచనేతల్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడిన్‌ 41శాతం రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. ఆరోస్థానంలో కెనడా అధ్యక్షుడు జ్యుస్టిన్‌ ట్య్రుడేయు (39 శాతం), జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిడ (38శాతం) రేటింగ్‌ లభించినట్లు మార్నింగ్‌ స్టార్‌ సర్వే ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement