న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలోనే అత్యంత ఎక్కువ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 1953 నుంచి 2010 వరకు సంభవించిన వరదల సమాచారాన్ని విశ్లేషించి రూపొందించిన నివేదిక ప్రకారం ఉమ్మడి ఏపీ (ప్రస్తుత తెలంగాణ, ఏపీ)లో మొత్తం 9.040 మిలియన్ హెక్టార్ల భూభాగం వరద ప్రభావానికి గురైందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వివరించారు.
వైఎస్సార్సీపీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక జవాబిచ్చారు. వరద నియంత్రణ, భూమి కోతకు గురికాకుండా నియంత్రించే అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని చెప్పారు. వరదల నియంత్రణ, భూమి కోతకు గురికాకుండా అమలు చేసే పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర మంత్రి భరోసానిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.