తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి ఆనాటి కాలంలో నిజాం నవాబ్ అనిపేరు వింటుండే వాళ్లం. ఎందుకంటే నిజాం ఒక పెద్ద ధనవంతుడుగా ఉండేవారు. ఈ కాలంలో ఎవరైన ధనవంతుడుగా స్టైల్ కొడితే.. ఏం నిజాంలా ఫోజ్ కొడుతున్నావు అనేవారు. అయితే నేడు హైదరాబాద్‌లోని పాత బస్తీలోని ఫలక్‌నూమాలో నివాసం ఉంటున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నసీర్ ఖాన్ దేశంలోనే అత్యంత ఖరీదైన కారును రూ. 12కోట్లుతో కొనుగోలు చేశాడు. దీంతో ఈ కాలంలో మరో నిజాం నవాబ్‌గా నసీర్ ఖాన్ ను పాతబస్తీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. అంతర్జాతీయ బ్రాండ్ ‘ మెక్‌లారెన్ 765 ఎల్‌టీ’ కారు అనే సూపర్ కారును నసీర్‌ఖాన్ కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన కారు గురించి మిస్టర్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
కారుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఉంచారు. దీంతో కొద్దిసేపట్లోనే ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. రెండు రోజుల క్రితమే కొత్త కారును కొనుగోలు చేశానని, ముంబై నుంచి హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నూమాకు తీసుకురావడం జరిగిందని తెలిపాడు. నసీర్‌ఖాన్ మెక్‌లారెన్ 765ఎల్‌టీ కారుతో సహా మరో రెండు ఖరీదైన కార్లను పాతబస్తీ ఫలక్‌నూమా తాజ్ ప్యాలెస్‌లో కార్లు షో చేశారు. ఖరీదైన కారు కొనుగోలుతో నసీర్‌ఖాన్ పాతబస్తీ జనాల్లోనేకాక హైదరాబాద్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారాడు.