Tuesday, November 26, 2024

మోస్ట్​ ఎవైటెడ్ గూగుల్ పిక్సెల్ 8.. 4న లాంచ్ ఈవెంట్

టెక్​ ప్రపంచంలో ఇప్పుడు చర్చ అంతా గూగుల్​ పిక్సెల్​ ఈవెంట్​ గురించే. భారత కాలమానం ప్రకారం అక్టోబర్​ 4న రాత్రి 7:30గంటలకు అమెరికాలో ఈ ఈవెంట్​ జరగనుంది. సంస్థ అధికారిక యూట్యూబ్​ ఛానెల్​లో ఈ ఈవెంట్​ను లైవ్​లో చూడవచ్చు. పిక్సెల్​ 8 సిరీస్​తో పాటు పలు ఆసక్తికర గ్యాడ్జెట్స్​ లాంచ్​ అవుతాయని టాక్​ నడుస్తోంది. ఈ వివరాలు..

గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​..

మీడియా రిపోర్టుల ప్రకారం గూగుల్​ పిక్సెల్​ 8లో 6.17 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. పిక్సెల్​ 8 ప్రోలో 6.7 ఇంచ్​ క్యూహెచ్​డీ+ డిస్​ప్లే ఉండొచ్చు. రెండింటికీ 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ లభిస్తుందట! గూగుల్​కు చెందిన టెన్సార్​ జీ3 చిప్​సెట్​ ఉండనుంది.

Google Pixel 8 pro : గూగుల్​ పిక్సెల్​ 8 ప్రోలో ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుందని సమాచారం. పిక్సెల్​ 8లో మాత్రం డ్యూయెల్​ రేర్​ కెమెరా ఉండొచ్చు. ప్రో మోడల్​లో బాడీ టెంపరేచర్​ సెన్సార్​ ఉంటుందని సమాచారం అందుతుంది.

- Advertisement -

గూగుల్​ పిక్సెల్​ 8 ధర 699 డాలర్లుగాను పిక్సెల్​ 8 ప్రో ధర 899 డాలర్లుగాను ఉండొచ్చు. అంటే ఇండియన్​ కరెన్సీలో అవి వరుసగా రూ. 58,120- రూ. 74,750.

Google Pixel watch 2 : గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2 కూడా లాంచ్​ సిద్ధమవుతోందని టాక్​ నడుస్తోంది. ఇందులో 1.2 ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉండొచ్చు. 2జీబీ ర్యామ్​- 16జీబీ స్టోరేజ్​ సైతం లభించొచ్చు. అనేక హేల్త్​ ట్రాకర్స్​, ఫిట్​నెస్​ ఫీచర్స్​ ఇందులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ గూగుల్​ పిక్సెల్​ వాచ్​ 2లో 24 గంటల బ్యాటరీ లైఫ్​ ఉంటుందని, 75 నిమిషాల్లో ఫుల్​ ఛార్జింగ్​ చేసుకోవచ్చని లీక్స్​ సూచిస్తున్నాయి. అనేక సేఫ్టీ ఫీచర్స్​ని కూడా ఇందులో గూగుల్​ అప్డేట్​ చేసినట్టు కనిపిస్తోంది. ఎమర్జెన్సీ సర్వీసెస్​ సమయంలో మెడికల్​ డేటాను కూడా షేర్​ చేసుకోవచ్చని టెక్​ నిపుణులు చెబుతున్నారు.

పిక్సెల్​ బడ్స్​ ప్రో..

ఈ దఫా ఈవెంట్​లో కొత్తగా ఎలాంటి ఇయర్​బడ్స్​ను గూగుల్​ లాంచ్​ చేయకపోవచ్చు. అయితే.. పిక్సెల్​ బడ్స్​ ప్రోకు కొన్ని కలర్​ ఆప్షన్స్​ ఇస్తుందని తెలుస్తోంది. పార్సిలిన్​ కలర్​, స్కై బ్లూ కలర్​ ఆప్షన్స్​ వస్తాయని సమాచారం. ఇవన్నీ రూమర్స్​ మాత్రమే. సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇంకొన్ని రోజుల్లో వీటిపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement