భారత నౌకాదళానికి చెందిన మిగ్-29 కె విమానం గోవా తీరంలో కుప్పకూలింది.ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డాడు. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని నేవీ అధికారులు భావిస్తున్నారు. కాగా, మిగ్-29కె రకర యుద్ధవిమానాలు 2019లో ఇండియన్ నేవీలో చేరిన తర్వాత కూలిపోవడం ఇది నాలుగోసారి. విమానం సముద్రం మీదుగా ఎగురుతుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కూలిపోయింది. నేవీ అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం వలన పైలట్ సురక్షింతంగా బయటపడ్డాడు.
శిక్షణలో వినియోగిస్తున్న ఈ విమానం నేవీ స్థావరానికి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు. రష్యాలో తయారైన మిగ్-29కెను ప్రపంచంలోనే అధునాతనమైనదిగా పరిగణిస్తుంటారు. ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్ హ్యాండిల్ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్ ముందుకు ఎజెక్ట్ అయి సురక్షితంగా బయటపడేందుకు సాయపడటం దీని ప్రత్యేకత.