Friday, November 22, 2024

తల్లి కౌగిలింతతో బిడ్డకు మానసిక ఆరోగ్యం.. తాజా అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బిడ్డను తల్లి ఆప్యాయంగా కౌగిలించుకోవడం ద్వారా బిడ్డ మానసిక ఆరోగ్యం ఎంతో చురుకుగా మారుతుందని తాజా అధ్యయనం తేల్చింది. ఐటీసీ సన్‌ఫీస్ట్‌ మామ్స్‌ మ్యాజిక్‌ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే అత్యంత శక్తివంతమైన సాధనంగా తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకునే ప్రక్రియ నిరూపితమైంది. తమ సంతోషాలకు ప్రధాన కారణంగా తమ తల్లులేనని సర్వేలో పాల్గొన్న 60శాతం మంది తెలిపారు.

- Advertisement -

ప్రతీ ఒక్కరూ తమ మాతృమూర్తులను మరింత తరుచుగా హగ్‌ చేసుకోవాలని అధ్యయనం పేర్కొంది. బెంగళూరు, ముంబై, ఢిల్లి నగరాల్లో ఈ సర్వేను నిర్వహించారు. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ తో పోలిస్తే విద్యార్థులు తమ తల్లులతో మరింత ఎక్కువగా ఆప్యాయంగా ఉంటున్నారు. ఈ సర్వేలో 13-35 ఏళ్ల పురుషులు మహిళలు పాల్గడొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement