Saturday, November 23, 2024

Delhi | హస్తినలోనే బాబు, పవన్.. బీజేపీ నేతలతో భేటీ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరిక ఖరారైపోయింది. కానీ సీట్ల సంఖ్య విషయంలోనే ఇంకా స్పష్టత రాలేదు. గురువారం ఢిల్లీ చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాత్రి గం.10.30 సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. అప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా అక్కడికి చేరుకున్నారు. నలుగురు నేతల మధ్య దాదాపు గంటన్నరకు పైగా సమావేశం జరిగింది. అయితే ఈ చర్చలు అసంపూర్తిగా ముగియడంతో శుక్రవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అయితే, ఇవాళ్టి సమావేశం వాయిదా పడింది.

అమిత్ షా, జేపీ నడ్డాలకు సమయం కుదరకపోవడంతో ఇవ్వాల‌ సమావేశమయ్యేందుకు సాధ్యపడలేదు. దాంతో రేపు సమావేశం కావాలని నిర్ణయించారు. అమిత్ షా రేపు పాట్నా వెళ్లనుండగా, ఆ పర్యటనకు ముందు కలిసేందుకు చంద్రబాబు, పవన్ లకు ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపు కూడా చంద్రబాబు, పవన్ ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement