న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి బండి సంజయ్ తొలిసారిగా హాజరయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత జరిగిన తొలి సమావేశానికి హాజరైన బండి సంజయ్కు పార్జీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జరిగిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత అంశాలతోపాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి గురించి చర్చించినట్టు తెలిసింది. దక్షిణ భారత దేశం నుంచి పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏకైక నేత బండి సంజయ్.. దక్షిణాది రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ స్థితిగతుల గురించి వివరించినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి గం. 10.00 వరకు కొనసాగింది.