ప్రభన్యూస్ : ఔషధ నియంత్రణ చట్టంలోని 65(2) నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆదేశించింది. ఈ మేరకు నిన్న ఔషధనియంత్రణశాఖ డైరెక్టర్ ప్రీతీ మీనా ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ మెడికల్ షాపులో కచ్చితంగా ఫార్మాసిస్టులు ఉండాల్సిందేనని ఆదేశించారు.
వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్ ఔషధాలను గుర్తింపు ఉన్న ఫార్మాసిస్టులే విక్రయించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital