Wednesday, November 20, 2024

కరోనా కోరల్లో మావోయిస్టులు

రాష్ట్రంలో మరోసారి ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టులపై కరోనా పంజా విసిరింది. దాదాపు 100 మంది మావోయిస్టులు కరోనా బారిన పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎక్కడ టీ మెంట్ తీసుకుంటున్నారు. ఎవరి వద్ద ఆశ్రయం తీసుకుంటున్నారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ లో తమ ప్రభావాన్ని చూపుతున్న మావోయిస్టులు తెలంగాణపై కూడా పట్టు సాధించేందుకు గత కొంత కాలంగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేడర్‌ను పెంచుకోవడంతో పాటు సాను భూతిపరులను సంపాదించుకునేందుకు కావాల్సిన ప్రయత్నాలన్నింటినీ వేగవంతం చేశారు.

ఛత్తీస్ ఘడ్ నుంచి తరచు సరిహద్దులలోని తెలంగాణ జిల్లాలకు వచ్చిపోయే మావోయిస్టులలో చాలా మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. కరోనా సోకిన వారికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎన్ఏబీ) అధికారులు నిమగ్నమయ్యారు. కరోనాతో బాధపడుతున్న వారు జన జీవన స్రవంతిలో కలిస్తే వారికి చికిత్స కూడా ఇప్పిస్తామంటూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు. ఒక వైపు మావోయిస్టుల లొంగిపోవాలని కోరుతూనే మరోవైపు వారెక్కడైన తల దాచుకున్నారా లేక ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారా అన్న అంశాలను రాబట్టేందుకు ప్రయత్నాలను
ముమ్మరం చేశారు.

కరోనా బారిన పడిన వారిలో కొంత మంది మావోయిస్టులు చికిత్స కోసం ఎదురు చూస్తున్నారని పోలీసులు అంటున్నారు. అలాంటివా రెవరైనా ఉంటే వారు లొంగిపోవాలని, వారికి కావాల్సిన చికిత్స చేయించడంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటామని కూడా భరోసా ఇస్తున్నారు. ఛత్తీలోని బస్తర్ రీజియన్ పరిధిలో దంతే
వాడ, బీజాపూర్, సుక్మా తదితర జిల్లాలలో దాదాపు 100 మంది వరకు మావోయిస్టులకు కరోనా సోకిందని పోలీసులు గుర్తించారు. కరోనాతో పాటు కొంత మంది మావోయిస్టులు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కుంటున్నట్లు తేల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement