పదేళ్ల తర్వాత దర్శకుడు హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఓ ప్రాజెక్ట్ చేపట్టారు. వీరిద్దరు కలిసి చేసిన మునుపటి చిత్రం “గబ్బర్‌సింగ్” బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది. కాగా, ప్రస్తుతం వీరిద్దరు కలిసి చేస్తున్న మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”. తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రం “తేరి” ఆధారంగా ఈ పోలీస్ డ్రామాను రూపొందిస్తున్నారు.
కాగా, నిర్మాణ బృందం కొత్త షూటింగ్ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మించడం ప్రారంభించింది. మొదటి షెడ్యూల్ పోలీస్ స్టేషన్ (సెట్)లో చిత్రీకరించారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు