భారత వాతావరణ శాఖ (IMD) డేటా ప్రకారం.. బెంగలూరు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ నుండి 23 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత 50 ఏళ్లలో మే నెలలో బెంగళూరులో అత్యంత తక్కు ఉష్ణోగ్రతలతో చలిరోజుగా ఇవ్వాల రికార్డు అయినట్టు అధికారులు తెలిపారు. చివరిసారిగా మే 14, 1972న బెంగళూరు నగరంలో ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
IMD తెలిపిన వివరాల ప్రకారం.. వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే ముందు ఈ ప్రాంతంలో రాబోయే రెండు రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తోంది. అంతకుముందు మే 11 న, అసని తుఫాను ప్రభావంతో బెంగళూరులో చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం కారణంగా కూడా టెంపరేచర్ గణనీయంగా పడిపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..