ఐపిఎల్ 2023 16వ సీజన్ లో భాగంగా ఇవ్వాల రాత్రి ఢిల్లీ, గుజరాత్ మద్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఢల్లీ. కాగా, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 130 పరుగులు చేయగలిగింది ఢిల్లీ టీం. ఇక, హార్డిక్ కప్టెన్సీ వహిస్తున్న గుజరాత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 120 బంతుల్లో 131 పరుగులు చేయాల్సి ఉంది.
ఢిల్లీ కాపిటల్స్ తరుఫున వచ్చిన బాట్స్ మెన్స్ దాదాపు వచ్చిన వాళ్లు వచ్చినట్టుగానే పెవెలియన్ చేరుకున్నారు. దీంతో 5 ఓవర్లలోనే 5 వికెట్లు నష్టపోయింది ఢిల్లీ జట్టు. ఇక ఢిల్లీ ఆశలు ఆవిరి అవుతున్నాయి అన్న సమయంలో అక్షర్ పటేల్ 30 బంతుల్లో 27 పరుగులు చేయగా, అమన్ హకీమ్ ఖాన్ 44 బంతుల్లో 51 పరుగులు తో అర్థ సెంచరీ చేసి ఢిల్లీ జట్టుని ఆదుకున్నాడు. అక్షర్ తరువాత వచ్చిన రిపాల్ పటేల్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చరో నాలుగు ఓవర్లు వేయగా… షమీ నాలుగు, రషీద్ ఒకటి, మోహిత్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నారు.